Welcome to the BLISSFUL journey

శ్రీ బాలాజీ గారు అనుభవాలు

0

చాలా మంది ధ్యానులకు మనం గురు సమక్షంలో ఉన్నా,పరోక్షంగా ఉన్నా మన సూక్ష్మ శరీరంలో జరిగే మార్పులు చేర్పులు అర్థం అవుతాయా మనం ఎక్కడ ఎలా ఏమి చేస్తున్నామో తెలుస్తూనే ఉంటుందా అన్న అనుమానం ఉంటుంది… సుషుమ్న ధ్యాన యోగి శ్రీ బాలాజీగారి అనుభవాలతో వారు అమ్మగారి పర్యవేక్షణలో ఏమేమి పొందారా అని ఆశ్చర్యంగా ఉంటుంది.
2014 లో శిల్పకళావేదిక పబ్లిక్ క్లాసులో అమ్మగారి సమక్షంలో శ్రీ బాలాజీ గారికి ఇనీషియేషన్ జరిగింది.పదిరోజుల తరువాత ఒక రాత్రి ధ్యానం చేసి నిద్రలోకి జారిన బాలాజీ గారికి శక్తి పాతం అనుభవమయింది.శరీరంలో నుండి వెండి జలతారు రంగులో చిన్న చిన్న త్రికోణాలుగా ఒక సర్పం బయటకు వచ్చింది.ఆ తరువాత అది తలలోకి వెళ్లిపోయింది.అప్పటికే చాలా రకాల మెడిటేషన్స్ ,మాస్టర్స్ అని తిరిగిన వారికి 49 రోజుల దీక్ష పూర్తి కాక ముందే అమ్మగారు కుండలినీ శక్తి ప్రేరేపించి చూపించగలిగారు.మరొకసారి అమ్మగారు పద్మావతీ దేవిలా దర్శనమిచ్చారు ఏమిటా అనుకుంటే పూర్వ జన్మలో శ్రీ పద్మావతి దేవి ఉపాసనా బలం అని అమ్మగారు వివరించారు.
ధ్యానంలో ఒకరోజు మొత్తం మట్టి వాసన – చుట్టూ దట్టమైన వేళ్ళు,నల్లటి గ్లోబ్ …కొంతసేపటికి గురువులు తనను భూమి కిందకు అంటే ఎర్త్ ఫీల్డ్ కు తీసుకు వెళ్లారని ,తను దానితో అనుసంధానమయ్యానని అర్థమైంది.మరొకసారి దీర్ఘ శ్వాసలపుడే విశ్వంతో కనెక్ట్ అయిపోయారు బాలాజీ గారు దివ్యలోకాల సందర్శనం అయింది.2016 నవంబర్ 11 న కార్తీక పౌర్ణమి పబ్లిక్ క్లాసులో శరీర వ్యాకోచం జరిగి వారి శరీరం చాలా పెద్దగా లావుగా ,బరువుగా హై ఎనర్జీ ఫీల్డ్ లాగా కనిపించింది…ధ్యానానంతరం కళ్లు తెరిస్తే ఒక మహాసర్పం అమ్మగారికి ఛత్రంలాగా ఉన్నది.గురువుల పైన అటువంటిదే మరొక సర్పం ఉన్నది…ఇదంతా అమ్మగారికి తెలుస్తుందా అనుకుంటే అమ్మగారు “అధ్బుతమైన చిరునవ్వు”తో ఆశీర్వదించారు. ఆ సాయంత్రం జీవన్ వంశీ దంపతులు “మీకు గొప్ప అనుభవం జరిగిందట అమ్మగారు చెప్పారు” – అనగానే అమ్మగారికి తెలిసిందని పులకించిపోయారు బాలాజీ గారు.
మీలోని మార్పులు మీకు తెలుస్తున్నాయా? అని 8 నెలల తరవాత అమ్మగారు అడిగినప్పుడు ,నాలో స్పిరిచువల్ గ్రోత్ నాకు తెలుస్తుంది ..కానీ ఇది ఎవరికి చెప్పగలను? అనుకున్నపుడు అడిగిన ఈ ప్రశ్న తను ఎంత గొప్ప గురువు రక్షణలో ఉన్నారో వారికి అర్థమైంది.
శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయి అమ్మగారు తన శిష్యులను రక్షణ,శిక్షణ,పర్యవేక్షణ – ఈ మూడే కాకుండా “అనుగ్రహం” నిరంతరము ప్రాణ వాయువులా ప్రసరింప చేస్తారన్నది శ్రీ బాలాజీ గారి అనుభవము.

Share.

Comments are closed.

Kriya Yogi
Typically replies within a day
Kriya Yogi
Om Sushumna ?

How can we help you?
23:57
Start Chat